దీక్ష: జయరామ్ రమేష్‌కు చంద్రబాబు కితాబు

By narsimha lode  |  First Published Feb 11, 2019, 1:09 PM IST

కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, పోలవరానికి అవసరమైన నిధులను ఇస్తామని మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ హామీ ఇచ్చారు.


న్యూఢిల్లీ: కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, పోలవరానికి అవసరమైన నిధులను ఇస్తామని మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ హామీ ఇచ్చారు.

సోమవారం నాడు ఆయన న్యూఢిల్లీలో చంద్రబాబునాయుడు దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.పుణ్య క్షేత్రమైన తిరుపతి వేదికగా 2014 ఎన్నికల ముందు ఇచ్చిన  హామీని  మోడీ  ప్రధానమంత్రి అయ్యాక నెరవేర్చలేదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఆరోపించారు.

Latest Videos

undefined

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తారని ఆయన కితాబునిచ్చారు.  తాను కూడ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని  ప్రతి రోజూ కనీసం నాలుగు రోజుల పాటు పరిశీలిస్తానని చెప్పారు.

రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా విషయమై చర్చ జరిగిన సమయంలో  ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు.  కానీ, అదే సమయంలో  రాజ్యసభలో ఉన్న బీజేపీ నేత వెంకయ్య నాయుడు పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన  విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం నుండి వైదొలిగిన వెంటనే  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టుకు సహాయం చేస్తామన్నారు.

రాజకీయంగా  టీడీపీతో తమకు సైద్ధాంతికంగా విబేధాలు ఉన్నాయని  జైరామ్ రమేష్ చెప్పారు.  అయితే తమకు కామన్ ప్రత్యర్థిగా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జత కట్టినట్టు ఆయన చెప్పారు.

ఇలాంటి కార్యక్రమాలకు  తాను దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. అయితే పునర్విభజన చట్టం చేయడంలో తాను కీలక పాత్ర పోషించినట్టు ఆయన చెప్పారు.  ఈ భావోద్వేగం కారణంగానే  తాను  ఈ దీక్షకు వచ్చినట్టు  జైరామ్ గుర్తు చేసుకొన్నారు.

తాను ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  ఢిల్లీకి వచ్చిన సమయంలో కేంద్రంలోని ప్రతి మంత్రి వద్దకు వచ్చి ఏపీ  విభజన చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని  కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ  కూడ   జైరామ్ రమేష్ తనతో వచ్చారని చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు. తన భార్య చనిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడ ఈ సభకు వచ్చి తన దీక్షకు జైరామ్ రమేస్ సంఘీభావం తెలిపారన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు

click me!