పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ వైఫల్యం చెందిందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విమర్శించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ వైఫల్యం చెందిందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో 12 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మద్దతు ప్రకటించారు.
ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు మద్దతుగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్‌లో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చేస్తున్న దీక్షకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు