మంగళగిరిలో ఉత్తర ద్వార దర్శనం..పోటెత్తిన భక్తులు (వీడియో)

By sivanagaprasad KodatiFirst Published Dec 18, 2018, 11:06 AM IST
Highlights

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సూర్యుడు ధనూ రాశిలో ప్రవేశించిన కాలం ఇది.. దేవతలకు బ్రహ్మ ముహూర్తకాలం.. వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే రోజు కావడంతో భక్తులు చలిని కూడా లెక్కచేయకుండా తరలివస్తున్నారు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సూర్యుడు ధనూ రాశిలో ప్రవేశించిన కాలం ఇది.. దేవతలకు బ్రహ్మ ముహూర్తకాలం.. వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే రోజు కావడంతో భక్తులు చలిని కూడా లెక్కచేయకుండా తరలివస్తున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి  తెల్లవారుజాము నుంచే క్యూకడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ బంగారు శంఖు తీర్థం తీసుకుంటే పాపాలు నశిస్తాయని నమ్మకం ఉండటంతో భక్తులు తీర్థం కోసం పోటీ పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
 

"

click me!