మీడియాపై చిందులు తొక్కిన నటుడు శివాజీ

Published : Dec 18, 2018, 11:04 AM IST
మీడియాపై చిందులు తొక్కిన నటుడు శివాజీ

సారాంశం

‘‘ రాస్తే రాసుకోండి.. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొంటున్నాడని రాస్తారు. అంతేగా..’’ అంటూ మండిపడ్డారు.

సినీ నటుడు శివాజీ మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు. గత కొంతకాలం క్రితం ‘ ఆపరేషన్ గరుడ’ పేరిట ఆయన మీడియా ముందు హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.

మండలపరిధిలోని అపార్టుమెంట్ లో ప్లాట్ల కొనుగోలు నిమిత్తం  రిజిస్టార్ ఆఫీసుకు వచ్చిన ఆయన మీడియా కంట కనిపడకుండేందుకు జాగ్రత్తపడ్డారు. అయినప్పటికీ.. మీడియా ఆయనను కనిపెట్టగా.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఫోటోలు, వీడియోలు తీస్తే బాగోందంటూ మీడియా ప్రతినిధులను హెచ్చరించినట్లు సమాచారం. ‘‘ రాస్తే రాసుకోండి.. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొంటున్నాడని రాస్తారు. అంతేగా..’’ అంటూ మండిపడ్డారు.

రిజిస్ట్రేషన్ పనులు వేగంగా పూర్తి చేసుకొని వెంటనే కారుతో సహా వెళ్లిపోయారు. ఆయనను మొబైల్ ఫోన్ ఫోటోలు తీయడానికి ప్రయత్నించిన వారిని బెదిరించి మరీ..  ఫోటోలను కూడా డిలీట్ చేయించారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్