ఆంధ్ర డిజిపి కి ముద్రగడ ఏడు ప్రశ్నలు

First Published Nov 22, 2016, 6:39 AM IST
Highlights

గోదావరి పుష్కరాలలో 30 మంది చనిపోయేందుకు కారణమయిన ముఖ్యమంత్రి పై ఎందుకు హత్య కేసు  నమోదు చేయలేదు?  ఈ  సంఘటన  ఆధారాలను మాయంచేసిన మాట నిజమేనా

సెక్షన్ 30 అమలు మధ్య గృహ నిర్భంధంలో ఉన్న కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్ర గడ పద్మనాభం రాష్ట్ర డిజిపి సాంబశివరావు కు ఏడుప్రశ్నలు పంపించి సమాధానాలు కోరారు. ముద్రగడ తలపెట్టిన కాపు పాదయాత్ర జరగకుండా ఆయనను గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగాపోరాటాలకు పోలీసుల అనుమతి అనే నియమం ఎక్కడుందో చెప్పాలని కూడ ఆయన కోరారు.  మంగళవారం నాడు ఆయన సందింధించినప్రశ్నలేఖాస్త్రం విశేషాలివే.

 

 

1. గోదావరి పుష్కరాల సమయంలో 30మంది భక్తుల మరణానికి కారణమయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మీద,వారికుటుంబసభ్యుల మీద హత్యానేరం కింద కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదు?

 

 

2. గోదావరి పుష్కరాలలో సెక్యూరిటీ ఉన్న ఘాట్ లో కాకుండా  ముఖ్యమంత్రిగారు సకుటుంబ సమేతంగా సామాన్యులు స్థానం చేయాల్సిన ఘాట్ కు ఎందుకురావలసి వచ్చింది.   ఎందుకు వచ్చారో తమకు తెలుసు గదా?  వారి ఘనత, దర్పం ప్రపంచమంతా తెలిపేందుకు జనం మధ్య నిలబడుకు ని షూటింగ్ చేయించుకోవాలనుకున్నారు. నేరం నుంచి తప్పించుకునేందుకు సిసికెమెరాల ఫుటేజీలు లేకుండా చేశారు. ఎందుకు చేశారు?

 

3. మామూలుగా దొంగలు, హంతకులు  హత్యానేరం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలు మాయం చేస్తారు.  నేరంచేయనివాడు  ఈ సాక్ష్యాలు ఎందుకు మాయం చేశాడు?  మీరు వారిని, బంధు గణాన్నికూడా హత్యానేరం నుంచి తప్పించేందుకేనా?

 

4. 2009  నుంచి చంద్రబాబు నాయుడు, షర్మిల, సిపిఎం, సిపిఐ నాయకులు చేసిన పాదయాత్రలు, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర , పోలవరం, గడపకు వైసిఆర్ సి యాత్రలు, తెలుగుదేశం ఇపుడు చేపట్టిన జనచైతన్య యాత్రలు, ఇతర కుల సోదరులు చేస్తున్న యాత్ర లు.. ఎలా ఎన్నో యాత్రలు జరిగాయి. వీటికి అనుమతులున్నాయా?

 

5. ప్రశాంతంగా గాంధేయ మార్గంలో పాదయాత్ర చేద్దామనుకుంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు, అది  ఏచట్టంలో ఉందో చెప్పిండి.

 

6. ప్రజలకు స్వేచ్ఛగా బతికే అవకాశమీయండి. ఎందుకంటే, 15.11.2016 న మరియు 16.11.2016 పోలీసు అధికారులు మాయింటి లోపలికి  చిన్నవీడియో, బటన్ వీడియో, కెమెరాలతో వచ్చారు. మేము నిఘా మధ్య భయభ్రాంతులతో బతకాలా? రోడ్ల మీద ఎన్నికెమెరాలయినా పెట్టుకోండి. ఎవ్వరు తప్పపట్టరు. వ్యక్తి స్వే చ్ఛకు   అడ్డు తగలడం  ఏమిటి? అవకాశం ఉంటే ఆ మేరకు అదేశాలు ఇప్పించడండి.

 

7. రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఉద్యమాలు పోలీసుల పర్మిషన్ తీసుకునే చేస్తున్నారా? తెలంగాణా,గుజరాత్, హర్యానా లలో వచ్చిన ఉద్యమాలు పోలీసుల పర్మిషన్ చేశారా?

 

 

 

click me!