అక్రమ కట్టడాలను కూలిస్తే.. పచ్చ బ్యాచ్ నెత్తీ నోరు కొట్టుకుంటోంది..విజయ్ సాయి

Published : Oct 26, 2020, 09:54 AM IST
అక్రమ కట్టడాలను కూలిస్తే.. పచ్చ బ్యాచ్ నెత్తీ నోరు కొట్టుకుంటోంది..విజయ్ సాయి

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డాడు. ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. '28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె, చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది. 

2014లో ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూముల్లో వేల కోట్లుగా నోట్ల కట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా? అంటూ వెటకరించాడు.

మరో ట్వీట్‌లో.. 'అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూలిస్తే పచ్చ బ్యాచ్ మొత్తం నెత్తీ నోరు కొట్టుకుంటోంది. ఆంధ్రా యూనివర్సిటీని దయ్యాల కొంపని సదరు ఆక్రమదారుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకునే ఏయూని భ్రష్టు పట్టించినప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు. పేదల ప్రయోజనాలకన్నా పచ్చనాయకుని ప్రయోజనాలే ఎక్కువైపోయాయా?' అంటూ విమర్శలు గుప్పించారు. 

విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను వైసీపి ప్రభుత్వం కూల్చడం మీద హైకోర్టు యధాతథ స్థితిని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గీతం యూనివర్సిటీ కట్టడాల తొలగింపు ఆగిపోనున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?