ఫణి తుఫాను దిశ కావాలా, చంద్రబాబును అడగండి.. విజయసాయిసెటైర్లు

Published : Apr 27, 2019, 12:53 PM ISTUpdated : Apr 27, 2019, 12:58 PM IST
ఫణి తుఫాను దిశ కావాలా, చంద్రబాబును అడగండి.. విజయసాయిసెటైర్లు

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘‘వాతావరణ సైంటిస్టులు ఫణి తుఫాను దిశను తెలుసుకోవాలంటే శాటిలైట్లతో నేరుగా సంభాషించే చంద్రబాబు సలహా తీసుకోవాలి. ఈయన యాంటెన్నాలు రాడార్ల కంటే బలమైన సిగ్నల్స్ తో పనిచేస్తాయి. తిత్లీ తుపాను సమయంలో ఐఎండి వాళ్లకు తనే తీరం దాటే ప్రదేశాన్ని యాక్యురేట్ గా చెప్పినట్టు డప్పు కొట్టుకున్నాడు’’ అంటూ ట్విట్టర్ లో విమర్శించారు.

అనంతరం ఏబీ వెంకటేశ్వరరావుపై కూడా విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు వదిలారు. ‘‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అంటుంటే ‘హతోస్మి’ అనిపించింది.  చంద్రబాబు కోసం  ఫోన్‌ ట్యాపింగులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలు అడ్డమైన అన్ని పనులూ చేసిన ఈయన... తన అవినీతి మీద విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? లేక ఇతరుల అవినీతిమీద విచారణ చేసే స్థితిలో ఉన్నారా?’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కి ఏబీ వెంకటేశ్వరరావు పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ ని జత చేశారు. 

PREV
click me!

Recommended Stories

Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu
YS Jagan Attends Wedding: నూతన వధూవరులను ఆశీర్వదించిన వై ఎస్ జగన్ | Asianet News Telugu