సిబిఐకి సుజనా చౌదరి టోకరా: అరెస్టు భయమేనా...

By telugu teamFirst Published Apr 27, 2019, 8:18 AM IST
Highlights

బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సిబిఐ బ్యాంకింగ్ సెక్యురిటీ అండ్ ఫ్రాడ్ సెల్ (బిఎస్ఎఫ్ సి) సమన్లు జారీ చేసినప్పటికీ సుజనా చౌదరి హాజరు కాలేదు. సిబిఐ ముందుకు వెళ్తే అరెస్టు అయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి శుక్రవారంనాడు సిబిఐ ముందు హాజరు కాలేదు. బెంగుళూరులోని సిబిఐ ముందు ఆయన శుక్రవారం హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆయన బెంగళూరు వెళ్లినప్పటికీ సిబిఐ ముందుకు మాత్రం వెళ్లలేదు. 

బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సిబిఐ బ్యాంకింగ్ సెక్యురిటీ అండ్ ఫ్రాడ్ సెల్ (బిఎస్ఎఫ్ సి) సమన్లు జారీ చేసినప్పటికీ సుజనా చౌదరి హాజరు కాలేదు. 2010 - 2013 మధ్య కాలంలో బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.364 కోట్ల ఫ్రాడ్ కేసులో ఏప్రిల్ 25వ తేదీన తమ ముందు హాజరు కావాలి బెంగళూర్ సిబిఐ సుజనా చౌదరికి సమన్లు జారీ చేసింది. 

శుక్రవారం బెంగళూరులోనే ఉన్న సుజనా చౌదరి సిబిఐ ముందుకు వెళ్లాలని తన కంపెనీ డైరెక్టర్లకు సూచించినట్లు తెలుస్తోంది. సిబిఐ ముందుకు వెళ్తే అరెస్టు అయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆ సంస్థ బోగస్ ఇన్ వాయిస్ ల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా మహల్ హోటల్స్ కు డబ్బులు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్, మహల్ హోటల్ కంపెనీలు రెండు కూడా సుజనా చౌదరికి చెందినవే.

click me!