తెరపైకి చంద్రబాబు కుట్ర స్టోరీలు... విజయసాయి రెడ్డి మండిపాటు

Published : Aug 20, 2019, 11:23 AM IST
తెరపైకి చంద్రబాబు కుట్ర స్టోరీలు... విజయసాయి రెడ్డి మండిపాటు

సారాంశం

చంద్రబాబు తెరపైకి కుట్ర స్టోరీలు తీసుకువస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉందని... దానిని వెంటనే చంద్రబాబు ఖాళీ చేయాలని అధికార పార్టీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.  

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు తెరపైకి కుట్ర స్టోరీలు తీసుకువస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉందని... దానిని వెంటనే చంద్రబాబు ఖాళీ చేయాలని అధికార పార్టీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.

కాగా... కావాలనే ఎగువ నుంచి నీటిని వదిలి ఇళ్లు మునిగిపోవాలని అలా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారు. డ్యాం, బ్యారేజిల భద్రత వారికి ముఖ్యం. బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్వాలేదట. తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు గారు’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం