కన్నాలక్ష్మీనారాయణతో సుజనా చౌదరి భేటీ

Published : Jun 24, 2019, 04:12 PM IST
కన్నాలక్ష్మీనారాయణతో సుజనా చౌదరి భేటీ

సారాంశం

వచ్చే ఎన్నికల సమయానికి ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే  సోమవారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణతో ఎంపీ సుజనా చౌదరి భేటీ అయ్యారు.

 టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన తర్వాత మొదటిసారిగా పార్లమెంట్‌లోని బీజేపీ కార్యాలయానికి సుజనాచౌదరి వచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై కన్నాతో సుజనాచౌదరి చర్చించినట్లు సమాచారం. మరికొందరు సీనియర్ నేతలను బీజేపీలోకి ఆకర్షించేందుకు కన్నా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నలుగురు సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ అందజేశారు. అనంతరం బీజేపీ వర్కంగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈ నలుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీ అగ్రనేత నడ్డా సాదరంగా ఆహ్వానించారు.

PREV
click me!

Recommended Stories

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు
Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే