వెనక్కి తగ్గాల్సిన అవసరం మాకు లేదు.. రామ్మోహన్ నాయుడు

By ramya neerukondaFirst Published Jan 26, 2019, 3:54 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఏపీని దేశంలో ఒక రాష్ట్రంగా కూడా కేంద్రం చూడటం లేదని.. అన్నింటిలోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఏపీని దేశంలో ఒక రాష్ట్రంగా కూడా కేంద్రం చూడటం లేదని.. అన్నింటిలోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

తాము కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని.. వెనక్కి తగ్గాల్సిన అవసరం తమకు లేదని, సస్పెండ్ చేసినా వెనకడుగు వేయమని చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మిగితా పక్షాలతో రెండు రోజుల్లో సమావేశమౌతున్నామన్నారు.  సమావేశాల రోజు తమ ప్రతిఘటన ఉంటుందని ఆయన తెలిపారు.

ఈవీఎంల అంశంపై ముందు అన్ని పక్షాలతో కలిసి ఎన్నికల కమిషన్ ని సంప్రదిస్తామని.. ఆ తర్వాత న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తామన్నారు. పార్లమెంట్‌ సమావేశాల ముందురోజు మిగతా పక్షాలతో సమావేశమవుతామని ఆయన చెప్పారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని, 2 నెలలు మాత్రమే ఉండే ఎన్డీఏకు సంవత్సరానికి అయ్యే బడ్జెట్‌ పెట్టే అర్హత ఎక్కడుందని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.

asianet news special

లక్ష నుంచి 25 కోట్లు.. తెలుగు ఓల్డ్ మూవీస్ కలెక్షన్స్ (1933-2002)

బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన బాక్స్ ఆఫీస్ కథలు!

click me!