నాపై అనర్హత వేటు సాధ్యం కాదు.. భరత్ కు రఘురామ కౌంటర్

By AN Telugu  |  First Published Jun 12, 2021, 10:50 AM IST

తాను ఏ పార్టీతోనూ జట్టుకట్టలేదని.. అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. వైకాపా ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సబ సభాపతి ఓం బిర్లాకు లోక్ సభలో వైకాపా చీఫ్ విప్ మార్గాని భరత్ శుక్రవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ స్పందించారు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించానని.. తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని వివరించారు. ‘కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశా. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. నాపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలేజ్ మోషన్ ఇస్తా. నాపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11న చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. హోంమంత్రిని సీఎం కలిశాకే ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అనర్హత వేటుపై ఇప్పటికే నాపై నాలుగైదుసార్లు ఫిర్యాదు చేశారు.’ అని రఘురామ అన్నారు. 

Latest Videos

రఘు రామ కృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలు సమర్పించామని భరత్ లోక్ సభ స్పీకర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని ఎంపీ భరత్ స్పీకర్ కు విన్నవించిన విషయం తెలిసిందే. 

click me!