డబుల్ సెంచరీ చేస్తాడనుంటే డకౌట్ అయ్యాండేంటి..!: అంబటి రాజీనామాపై రఘురామ కామెంట్స్

By Arun Kumar PFirst Published Jan 7, 2024, 7:26 AM IST
Highlights

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసిపిలో చేరిక,  ఆ వెంటనే రాజీనామా చేసిన ఎపిసోడ్ పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

అమరావతి : అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ నాయకుడిగా సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించాడు. చాలాకాలంగా అధికార వైసిపికి సన్నిహితంగా వుంటూ వచ్చిన అతడు తాజాగా షాకింగ్ ప్రకటన చేసాడు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరిన రాయుడు తాజాగా రాజీనామా చేసాడు. అధికార పార్టీలో ఎందుకు చేరాడో... ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసాడో ఎవరికీ అర్థంకావడంలేదు... కానీ ఎన్నికలకు ముందు రాయుడు ఎపిసోడ్ వైసిపిని కాస్త ఇబ్బందిపెట్టేలా వుంది. అధికార పార్టీ, ముఖ్యమంత్రిపై విమర్శలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఇది ఓ అస్త్రంగా ఉపయోగపడుతోంది. 

అంబటి రాయుడు రాజీనామాపై వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు. వైఎస్ జగన్ రెడ్డి గురించచి తెలుసుకునేందుకు తనకు ఆరునెలలు పట్టింది... కానీ  అంబటి రాయుడు ఆరు రోజుల్లోనే తెలుసుకున్నాడని అన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని ఇంత తొందరగా గ్రహించి, వైసిపిలో చేరి ఎంత తప్పుచేసాడో రాయుడు తెలుసుకున్పాడు... వెంటనే రాజీనామాతో సరిదిద్దుకున్నాడని రఘురామ పేర్కొన్నారు.  

వైసిపి మునిగిపోయే నావ వంటిదని తొందరగానే గుర్తించి ఆ పార్టీని వీడాలని అంబటి రాయుడు నిర్ణయించుకున్నాడని రఘురామ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఆయన తెలుగుదేశం లేదా జనసేన పార్టీలో చేరే అవకాశాలున్నాయని నరసాపురం ఎంపీ పేర్కొన్నారు. క్రికెటర్ గా ఎంత వేగంగా అయితే పరుగులు చేసాడో అంతే వేగంగా రాయుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడని... ఇందుకు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందేనని రఘురామ అన్నారు.

Also Read  ఇదంతా చంద్రబాబు కుట్రనే.. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సజ్జల రియాక్షన్

రాయుడు క్రికెట్ లో రికార్డులు సృష్టించినట్లే రాజకీయాల్లోనూ అద్భతాలు చేస్తాడని భావించిన అభిమానులు ఇలా హిట్ వికెట్ అయ్యాండేంటని భావించవచ్చు... డబుల్ సెంచరీ చేస్తాడనుకుంటే బ్యాటింగ్ చేయకుండానే వెనుదిరిగాడేంటని అనుకోవచ్చు... కానీ రాయుడు తీసుకున్నది చాలా మంచి నిర్ణయమని  రఘురామ అన్నారు. క్రికెటర్ లో ఎంత వేగంగా బ్యాటింగ్ చేస్తాడో అంతే వేగంగా రాజకీయ నిర్ణయం కూడా తీసుకున్నాడని అన్నారు. వైఎస్ జగన్ దాన గుణాన్ని, ప్రజలను ప్రేమించే విధానాన్ని రాయుడు కనిపేట్టేసాడని రఘురామ కృష్ణంరాజు వ్యంగంగా కామెంట్ చేసారు.  

ఇక     అంబటి రాయుడు వైసిపిలో చేరిక, ఆ వెంటనే రాజీనామా చేయడంపై ప్రతిపక్ష తెలుగుదేశం కూడా క్రికెట్ బాషలో స్పందించింది. దుష్టుడైన వైఎస్ జగన్ తో కలిసి పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడకూడదన్న రాయుడు నిర్ణయం సంతోషకరం అంటూ టిడిపి అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా   పేర్కొంది. అంబటి రాయుడు భవిష్యత్ బావుండాలని టిడిపి కోరుకుంది. ఈ మేరకు రాయుడు రాజీనామా ప్రకటన ట్వీట్ పై రియాక్ట్ అవుతూ టిడిపి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
 

click me!