చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏపీలో త్రిమూర్తులు కలుస్తారనేది నా లెక్క: ఎంపీ రఘురామ

Published : Apr 22, 2023, 04:17 PM IST
చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏపీలో త్రిమూర్తులు కలుస్తారనేది నా లెక్క: ఎంపీ రఘురామ

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై యర్రగొండపాలెంలో జరిగిన రాళ్ళ దాడి ఘటన పైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై యర్రగొండపాలెంలో జరిగిన రాళ్ళ దాడి ఘటన పైన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి  రోజని అన్నారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఎస్‌జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా పెట్టి చంద్రబాబుకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి రఘురామ లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం హద్దులు మీరుతోందని అన్నారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను దుర్మార్గంగా వేధిస్తున్నారంటూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రధాని దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు.

రాక్షసులను అంతమొందించాలని దేవతలు కూడా కలిశారని.. ఏపీలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలుస్తారా?, కేవలం విష్ణువు, మహేశ్వరుల మాత్రమే కలుస్తారా? అనేది చూడాల్సి ఉందన్నారు. విష్ణువు, మహేశ్వరులు కలవడం అంటే  కామన్ అని.. బ్రహ్మ కూడా మహేశ్వరుడే అంటున్నట్టుగా ఉన్నారని చెప్పారు. బ్రహ్మ డైరెక్ట్‌గా రాకపోయిన మహేశ్వరుడి రూపంలో అయినా రావొచ్చని అన్నారు.  ఇక్కడ విష్ణువు అంటే టీడీపీ అని, బ్రహ్మ  అంటే బీజేపీ అని, శివుడిగా జనసేన అని అన్నారు. తన లెక్కయితే త్రిమూర్తులు కలుస్తారని అన్నారు.  

రాక్షస రాజ్యంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నవారికే రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి‌లో మార్పు వచ్చిందని.. సంస్కారవంతంగా  మారారని అన్నారు. దరిద్రపు సంస్కృతి నుంచి బయటపడుతున్నారని చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

నిమ్మల రియాక్షన్ చూడండి | CM Chandrababu Interaction With Arnab Cyclone Victims
CM Chandrababu Great Words About CM Revanth Reddy | Asianet Telugu