ఆ పదవి, గౌరవం.. అంతా తాత్కాలికం.. మురళీ మోహన్

Published : Sep 18, 2018, 10:06 AM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ఆ పదవి, గౌరవం.. అంతా తాత్కాలికం.. మురళీ మోహన్

సారాంశం

అదే సీనీ నటులను అయితే.. ప్రజలు గుండెల్లో దాచుకుంటారని ఆయన అన్నారు. 

రాజకీయ నాయకులకు లభించే పదవి, గౌరవం అన్నీ తాత్కాలికమేనని ఎంపీ మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. అదే సీనీ నటులను అయితే.. ప్రజలు గుండెల్లో దాచుకుంటారని ఆయన అన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా చాగల్లు తెలగా సంఘం ఏర్పాటు చేసిన సన్మాన సభలో మురళీ మోహన్ పాల్గొని మాట్లాడారు.

పద్య నాటకాలు తెలుగు భాషకు మాత్రమే సొంతమని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రిపై ఉందన్నారు.చాగల్లులో గణపతి ఉత్సవ కమిటీలు కళలను ప్రోత్సహిస్తూ, కళాకారులను సన్మానించడం అభినందనీయ మన్నారు. అనంతరం గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ నాటక రంగానికి నంది అవార్డులు ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీవీఆర్‌ కళాక్షేత్రం అధ్యక్షుడు బుద్దా వెంకట రామారావు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఆళ్ల హరిబాబు, మాజీ ఎంపీపీలు కొఠారు మునేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ గండ్రోతు సురేంద్ర కుమార్‌, మీజీ ఏఎంసీ డైరెక్టర్‌ జట్టా ఏడు కొండలు, తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం