ఏపీలో పట్టుకు కాంగ్రెస్ వ్యూహాలు.. నేడు కర్నూలుకు రాహుల్

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 8:55 AM IST
Highlights

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. ప్రధానంగా రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.

ప్రత్యేకహోదా, విభజన హామీలు, బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం తదితర అస్త్రాలను ఆయుధాలుగా చేసుకుని ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయన పెద్దపాడులో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసాన్ని సందర్శించనున్నారు.

అనంతరం ఒంటిగంటకు బీవై రెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థులతో ముచ్చటించి.. 2.45కు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం కోట్ల నివాసాన్ని సందర్శిస్తారు.

3.45కు జగ్జీవన్ రామ్‌ విగ్రహానికి నివాళులర్పించి.. సాయంత్రం 4 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాహుల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డి, తెలంగాణ మాజీ ఎంపీ వి.హనుమంతరావు పర్యవేక్షించారు. 
 

click me!