
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఖండించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తాయన్నారు. విశాఖ విమానాశ్రయంలో వేచి ఉన్న జగన్‌పై వెయిటర్‌గా పనిచేసే వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కోడిపందేలకు వాడే కత్తితో జగన్‌పై దాడి చేసినట్లు తెలిసింది. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.