మూడేళ్లలో మూడు బిల్డింగ్‌లైనా కట్టారా..?: వైసీపీ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్ ఆగ్రహం

By Sumanth KanukulaFirst Published Sep 17, 2022, 2:53 PM IST
Highlights

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజాధానుల ప్రతిపాదన రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. 

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజాధానుల ప్రతిపాదన రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని విమర్శించారు. మూడు రాజధానులు దేవుడెరుగు.. మూడేళ్లలో మూడు బిల్డింగ్‌లైనా కట్టారా? అని ప్రశ్నించారు. ఏపీ ఆర్థికవ్యవస్థ రోజురోజుకు క్షీణిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గొప్పగా చెప్పే సీఎం జగన్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతాపత్రం విడుదల చేయాలని కోరారు. 

అయితే రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని జీవీఎల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అంశం కాదన్నారు. అమరావతి రైతుల ఎప్పుడూ అండగానే ఉంటుందని ఎంపీ జీవీఎల్‌ అన్నారు. 

ఇదిలా ఉంటే.. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానులపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్.. అమరావతే రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 

సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టుగా వివరించింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెల్లలో అమరావతిని అభివవృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని తెలిపింది. 

click me!