వివాహేతర సంబంధం... ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసిన మహిళ...

Published : Sep 17, 2022, 11:11 AM IST
వివాహేతర సంబంధం... ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసిన మహిళ...

సారాంశం

ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడ్ తో కోసేసింది. ఇద్దరి మధ్య ఆర్థిక, ఇతర మనస్పర్థలు తలెత్తడమే కారణమని సమాచారం. 

ప్రకాశం : కొండపి మండలంలోని మూగచింతల గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. బాధితుడు (60) అదే గ్రామానికి చెందిన మహిళ (55)తో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరికీ ఇటీవల ఆర్థిక, ఇతర మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మహిళ ఇంటికి వచ్చిన ప్రియుడిని బ్లేడుతో మర్మాంగాన్ని కోసింది. వెంటనే పొరుగువారు బాధితుడిని ఒంగోలు రిమ్స్ లో చేర్చారు. అక్కడ బాధితుడికిచ్చిన ఫిర్యాదు మేరకు కొండపి ఎస్సై కె. రామకృష్ణ శుక్రవారం కేసు నమోదు చేశారు. 

ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో రెండో వివాహం చేసుకున్న వ్యక్తిని కరెంట్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు కుటుంబసభ్యులు, గ్రామస్తులు.  హన్మకొండ నుండి తీసుకువచ్చి కరెంట్ పోల్ కు కుటుంబ సభ్యులు కట్టేశారు. నాలుగు సంవత్సరాల క్రితం 20లక్షలు కట్నం తీసుకొని వివాహం చేసుకొని కొడుకు పుట్టాక శ్రీకాంత్ రెడ్డి  వదిలిపెట్టాడు. మోసం చేసిన భర్తను భార్య అఖిల చెప్పుతో కొట్టి మెడలో చెప్పుల దండ వేసింది.  తనకు న్యాయం చేయాలంటున్న బాధిత మహిళ అఖిల కోరుతుంది. 

వివాహేతర సంబంధం.. లాడ్జిలో గొడవ, నెట్టేయడంతో తలకు దెబ్బ తగిలి.. వ్యక్తి అనుమానాస్పదమృతి...

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని తిరుమలగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమలగిరిలోని మడ్‌ఫోర్ట్‌లో శుక్రవారం ఉదయం 40 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. దేవమ్మ అనే ఆ మహిళ గొంతు కోసి హత్య చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు తిరుమల్ గిరి పోలీసులు తెలిపారు. అయితే, మృతురాలి ఒంటిమీద చెవిపోగులు కనిపించకపోవడంతో.. డబ్బుల కోసం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

శుక్రవారం ఉదయం రక్తపు మడుగులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హత్య అని నిర్ధారించిన పోలీసులు ముందుగా బాధితుడిని గుర్తించే పని మొదలుపెట్టారు. ఆమె ఫోటోను స్థానికంగా ఉన్న కాలనీల్లో పంచిపెట్టారు. దీని ద్వారా మృతురాలి గుర్తింపును తెలుసుకున్నారు.

దేవమ్మ మద్యం మత్తులో ఉన్నప్పుడే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె చివరిసారిగా ఎవరితో కనిపించిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె చివరిగా ఏ కల్లు దుకాణానికి వెళ్ళింది.. ఆమె మీద లైంగిక వేధింపులు జరిగాయో లేదో తెలియాలంటే పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. దేవమ్మ స్వస్థలం వనపర్తి జిల్లా. నెలరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి దినసరి కూలీగా పనిచేస్తోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది.

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu