హీరో అనుకుంటున్నావా, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు.. లోకేష్ పై గోరంట్ల

Published : Jun 16, 2020, 12:07 PM IST
హీరో అనుకుంటున్నావా, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు.. లోకేష్ పై గోరంట్ల

సారాంశం

తమ సీఎం జగన్ ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. లోకేష్ నోరు దగ్గర పెట్టుకోని మాట్లాడాలంటూ హితవు పలికారు.  

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ యువ నేత లోకేష్ పై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ సీఎం జగన్ ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. లోకేష్ నోరు దగ్గర పెట్టుకోని మాట్లాడాలంటూ హితవు పలికారు.

 ‘‘నారా లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మాటలు దగ్గర పెట్టుకుని అనంతపురం రావాలి. జగన్మోహన్‌రెడ్డిని విమర్శిస్తే హీరో కాలేవు. కల్లిబొల్లి మాటలతో ప్రజలను మభపెట్టవద్దు. మంగళగిరిని మందలగిరి అని మాట్లాడుతున్నారు. ఎవరి కొంపలు అంటించడానికి చంద్రబాబు కాగడలు పట్టుకున్నారు. అలీబాబా అరడజను దొంగలు లాగా కాగడాలు పట్టుకున్నారు. రాజారెడ్డి కుటుంబంలో కులాంతర వివాహం చేసుకున్నారు. జగన్మోహన్‌రెడ్డి పార్టీలకు అతీతంగా వెళ్తున్నారు.’’ అని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు.

కాగా.. గోరంట్ల మాధవ్ గతంలో అనంతపురంలో ఎస్ఐ గా పనిచేసిన సంగతి తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డితో వాగ్వాదం పెట్టుకోని గోరంట్ల పాపులారిటీ పెంచుకున్నారు.  ఆ తర్వాత వైసీపీలో చేరారు. గత ఎన్నికల సమయంలో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తాజాగా... లోకేష్ పై విమర్శలు కురిపించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్