చంద్రబాబుకు షాక్, టీడీపీకి గంటా శ్రీనివాసరావు గుడ్‌బై.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా..?

By Siva KodatiFirst Published Oct 10, 2021, 10:52 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (ganta srinivasa rao) షాకిచ్చారు. టీడీపీ (tdp) ప్రాథమిక సభ్యత్వానికి ఆయన  రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (ganta srinivasa rao) షాకిచ్చారు. టీడీపీ (tdp) ప్రాథమిక సభ్యత్వానికి ఆయన  రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత మూడు సంవత్సరాల నుంచి పార్టీ మారుతానంటూ ఎప్పటికప్పుడు మీడియాకు లీకులు విడుదల చేశారు గంటా. అయితే తాజాగా ఆయన రాజీనామాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 

కాగా, ఇటీవల తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుంటానని గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో అన్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ స్టెంట్స్‌ కూడా వేయించుకున్నట్లు చెప్పారట. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ (vizag north) నుంచి టిడిపి తరుఫున గంటా గెలిచినా రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారం దక్కకపోవడంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఆయన వ్యవహరించడం లేదు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తానంటూ ఏడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అనంతరం విశాఖ కేంద్రంగా ఊపందుకున్న కార్మిక ఉద్యమం నేపథ్యంలో గంటా తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ALso Read:విశాఖ: చంద్రబాబుతో గంటా భేటీ, బుజ్జగించేందుకేనా..?

స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం తానూ పోరాడుతానని చెప్పి కొన్ని రోజులు హాడావిడి  చేశారు. గంటా రాజీనామా ఆమోదం నేటికీ పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు మధ్య మధ్యలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో (ysrcp) చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి (ys jagan) నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో గంటాకు ఆ  ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ముఖ్యంగా తన ఒకప్పటి శిష్యుడు , మంత్రి అవంతి శ్రీనివాస్ నుంచి వ్యతిరేకత వస్తుండటంతో జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని టాక్. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు రాజకీయాలకు దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది

click me!