కర్నూలులో దారుణం.. తల్లీకుమార్తెలపై కత్తులతో దాడి, హత్య..

Published : Mar 14, 2023, 02:11 PM ISTUpdated : Mar 14, 2023, 02:13 PM IST
కర్నూలులో దారుణం.. తల్లీకుమార్తెలపై కత్తులతో దాడి, హత్య..

సారాంశం

కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ కుటుంబం మీద కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు తీవ్రగాయాలపాలై మృతి చెందారు. 

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబంపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన కర్నూలు సుబ్బలక్ష్మీ నగర్ లో జరిగింది. ఈ దాడిలో తల్లీ కుమార్తెలు తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఇంటి యజమానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ జంట హత్యలకు కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా  తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu