
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ అయింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ కావడంతో ఐటీ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులు పనిచేయడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సేవలకు బ్రేక్ పడింది. అయితే సాంకేతిక సమస్య కారణంగానే సర్వర్ డౌన్ అయినట్టుగా తెలుస్తోంది. సాంకేతిక సమస్యను సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. డేటా సెంటర్ సర్వర్ డౌన్ కావడానికి గల కారణాలపై అధికార వర్గాల నుంచి ఎటువంటి వివరాలు వెలువడలేదు.