గవర్నర్ ప్రసంగం: ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ వాకౌట్

Published : Mar 14, 2023, 11:22 AM ISTUpdated : Mar 14, 2023, 03:25 PM IST
గవర్నర్ ప్రసంగం:  ఏపీ అసెంబ్లీ నుండి  టీడీపీ వాకౌట్

సారాంశం

ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు  మంగళవారంనాడు  వాకౌట్  చేశారు. గవర్నర్ ప్రసంగంలో  అన్ని అబద్దాలు  చెప్పించారని  టీడీపీ ఆరోపించింది. 

అమరావతి: అబద్దాలు చెబుతున్నారని  గవర్నర్ ప్రసంగాన్ని మధ్యలోనే  టీడీపీ బాయ్ కాట్ చేసింది.  సభ నుండి టీడీపీ సభ్యులు  వాకౌట్  చేశారు.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాాలు మంగళవారంనాడు ప్రారంభమయ్యాయి.  ఏపీ అసెంబ్లీ ఉభయ సభలనుద్దేశించి  ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్  ప్రసంగించారు.  గవర్నర్ ప్రసంగంలో  ప్రభుత్వం  అన్ని అబద్దాలు చెప్పించిందని టీడీపీ సభ్యులు  నినాదాలు  చేశారు.  గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో  మధ్యలో  మధ్యలో  టీడీపీ సభ్యులు  నినాదాలు  చేశారు.  క్షేత్రస్థాయిలో  పరిస్థతి మరో రకంగా  ఉందని  టీడీపీ సభ్యులు  చెప్పారు.  ప్రాజెక్టుల విషయాన్ని గవర్నర్  అబ్దుల్ నజీర్  తన ప్రసంగంలో  ప్రస్తావించారు. పోలవరం, పూల సుబ్బయ్య  వెలిగొండ ప్రాజెక్టు  వంటి  ప్రాజెక్టులు  పురోగతిలో  ఉన్నాయని  గవర్నర్  చెప్పారు.  అయితే  ప్రాజెక్టుల అంశంపై  ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని  టీడీపీ సభ్యులు  చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.  ప్రభుత్వ తీరును నిరసిస్తూ  గవర్నర్ ప్రసంగాన్ని  బాయ్ కాట్  చేస్తున్నట్టుగా  ప్రకటించారు.  సభ నుండి  టీడీపీ సభ్యులు వాకౌట్  చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం