అమ్మాయితో అక్రమ సంబంధం?: జంగారెడ్డిగూడెంలో అర్థరాత్రి దారుణ హత్య

Published : Sep 18, 2021, 10:40 AM ISTUpdated : Sep 18, 2021, 10:41 AM IST
అమ్మాయితో అక్రమ సంబంధం?: జంగారెడ్డిగూడెంలో అర్థరాత్రి దారుణ హత్య

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మోడల్ డెయిరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ అమ్మాయితో ఉన్న అక్రమ సంబంధమే అతని హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వ్యక్తి అత్యంత దారుణ హత్యకు గురయ్యాడు. జంగారెడ్డిగూడెంలోని మునసబుగారి వీధిలో అర్థరాత్రి మోడల్ డెయిరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్ మీద హత్యాప్రయత్నం జరిగింది. 

గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని పోలీసులు 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి మరింతగా విషమించడంతో అక్కడి నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. 

విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు. ఓ అమ్మాయితో ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మోడల్ డెయిరీలో పనిచేస్తున్న ఓ అమ్మాయితో సురేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్