అసెంబ్లీలో చంద్రబాబు శపథం వీడియో వైరల్... స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Nov 26, 2021, 1:36 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. 

అమరావతి: ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీ సమావేశాల సమయంలో సభ్యులెవ్వరూ సభలోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేదం విధించారు. ఇకపై అసెంబ్లీ హాల్ లోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదని సభలోనే స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఇటీవల చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం... ఈ వీడియోలు వైరల్ గా మారిన నేపథ్యంలో స్పీకర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఇటీవల  andhra pradesh assembly లో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజాసమస్యలపై చర్చను కాస్తా పక్కదారి పట్టించి వ్యక్తిగత జీవితాల గురించి అసభ్యకర దూషణలకు ప్రతిపక్ష టిడిపి, అధికార వైసిపి సభ్యులు దిగారు. ఈ క్రమంలోనే YSRCP సభ్యులు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత nara chandrababu naidu ని అవమానించేలా... ఆయన భార్య nara bhuvaneshwari గురించి అనుచిత వ్యాఖ్యలు చేసారట. దీంతో చంద్రబాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.  

తన కుటుంబసభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడిన ఈ సభకు ఇక రాబోనని... తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు సవాల్ చేసారు. ఈ సమయంలో చంద్రబాబు speaker tammineni sitharam మైక్ ఇవ్వకున్నా టిడిపి సభ్యులు సెల్ ఫోన్లలో వీడియోను చిత్రీకరించారు. చంద్రబాబు శపధానికి సంబంధించిన వీడియోను ఆ తర్వాత టిడిపి సభ్యులు మీడియాకు ఇవ్వడమే కాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అదికాస్తా వైరల్ గా మారింది. 

read more  Nara Bhuvaneswari: అసెంబ్లీలో అవమానంపై ఏపి ప్రజలకు బహిరంగ లేఖ

అసెంబ్లీలో స్పీకర్ అనుమతితోనే సభ్యులు మాట్లాడాల్సి వుంటుంది. ఆయన మైక్ ఇస్తేనే సభ్యుల మాటలు రికార్డుల్లోకి వెళుతుంటాయి. కానీ చంద్రబాబు ఘటనలో స్పీకర్ మైక్ ఇవ్వకున్నా చంద్రబాబు మాటలు రాష్ట్రప్రజలకు చేరాయి. దీంతో ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా వుండే చర్యల్లో భాగంగా సమావేశం జరుగుతున్నంత సేపు హాల్ లోకి సభ్యులు సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేదం విధించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

ఇదిలావుంటే తన కుటుంబంపై, సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసిపి సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో మనోవేదనకు గురైన చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున విలపించారు. అసెంబ్లీ పరిణామాలు, తనకు జరిగిన అవమానం గురించి వివరిస్తూ భార్య భువనేశ్వరి గురించి చాలా అసభ్యంగా మాట్లాడారంటూ చంద్రబాబు ఎమోషన్ అయ్యారు. మొహానికి చేతులు అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. 

read more  నీ భార్యను ఏమీ అనలేదు సామీ అంటే వినవే...శృతిమించుతున్నావ్..: చంద్రబాబుపై మంత్రి నాని సీరియస్

ఇలా అసెంబ్లీ వ్యవహారం, చంద్రబాబు రోదన రాష్ట్రంలోనే జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబును పలువురు కేంద్ర నాయకులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఇక నందమూరి కుటుంబంతో పాటు టిడిపి శ్రేణులు వైసిపి నాయకులపై విరుచుకుపడ్డారు.  

ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఏపీ ప్రజలకు భువనేశ్వరి బహిరంగ లేఖ రాశారు. తనకు జరిగిన అవమానం మరొకకిరి జరగకూడదని ఆమె అన్నారు. 

click me!