కన్నా భూబకాసురుడు...బుద్ధా వెంకన్న

Published : Sep 19, 2018, 03:04 PM IST
కన్నా భూబకాసురుడు...బుద్ధా వెంకన్న

సారాంశం

కన్నాకు తాము 10 ప్రశ్నలు వేస్తున్నామన్నారు. కన్నాకు మించిన భూబకాసురుడు ఎవరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. 


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కన్నా లక్ష్మీనారాయణ భూ బకాసురడని ఆరోపించారు.

నిజాయితీగా ప్రజలను పాలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కన్నా విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. కన్నాకు తాము 10 ప్రశ్నలు వేస్తున్నామన్నారు. కన్నాకు మించిన భూబకాసురుడు ఎవరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ముగ్గురు సీఎంల దగ్గర పనిచేసి వందల ఎకరాల భూమిని కాజేయలేదా? అని బుద్ధా నిలదీశారు. పదేళ్లలో జరిగిన ఐదు లక్షల ఎకరాల భూ కబ్జాలో కన్నా పాత్ర ఎంత? అని అడిగారు.
 
కన్నా లక్ష్మినారాయణ కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ భాగోతంపై చర్చిద్దామా? అని బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. సైకిల్‌పై తిరిగిన కన్నాకు భవంతులు, ఢిల్లీలో ఫ్లాట్స్‌ ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ‘పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మీ కన్నా కళంకిత మంత్రి ఎవరైనా ఉన్నారా? మోదీ, అమిత్‌ షా రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదువుతూ.. చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారని’ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu