రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్.. కస్టడీ పిటిషన్ దాఖలు చేయని పోలీసులు..

Published : Jun 05, 2022, 02:22 PM IST
 రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్.. కస్టడీ పిటిషన్ దాఖలు చేయని పోలీసులు..

సారాంశం

తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్(అనంతబాబు) గత నెల 23న పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు 14 రోజుల కస్టడీ విధించడంతో అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్(అనంతబాబు) గత నెల 23న పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు 14 రోజుల కస్టడీ విధించడంతో అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన రిమాండ్ గడువు రేపటితో ముగియనుంది. అయితే ఇప్పటివరకు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై తొలి నుంచి మృతుడి కుటుంబసభ్యులు, దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

తాజాగా ఈ కేసులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు తీరుపై ప్రతిపక్ల నేతలు, దళిత నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు తొలి నుంచి కేసును తప్పుదోవ పట్టించి నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా కావాలనే కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.  మరోవైపు ఆన్‌లైన్‌లో విచారణకు హాజరువుతానని అనంతబాబు.. న్యాయమూర్తిని అభ్యర్థించినట్టుగా సమాచారం.

మరోవైపు.. రాజమహేంద్రవరం జైలులో రిమాండ్‌లో ఉన్న అనంతబాబు.. తోటి ఖైదీపై దాడి చేశారని వార్తలు వచ్చాయి. ఏదో విషయంపై ఇద్దరికీ మాటా మాటా పెరగడంతో.. ఎమ్మెల్సీ కోపంతో అతని మీద చేయి చేసుకున్నారని ప్రచారం. అయితే ఈ వార్తలను జైలు అధికారులు ఖండించారు. అలాంటిదేమీ జరగలేదని జైలు అధికారులు తెలిపారు. 

జైలులో సకల మర్యాదలు..!
మరోపక్క ఎమ్మెల్సీ  అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు అందుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండు రోజులకే పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశారని.. కోరిన ఆహారం బయటినుంచి అందుతోందని తెలుస్తోంది. ఎమ్మెల్యేని జాగ్రత్తగా చూసుకోవాలని జైలు అధికారులపై స్థానిక నేతలు.. పెద్ద స్థాయి నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక, నిబంధనల ప్రకారం ఖైదీలు ముగ్గురికి ఒక గది కేటాయిస్తారు. ఎమ్మెల్సీ ఒక్కరినే ఓ గదిలో ఉంచారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu