కృష్ణాజిల్లా: లారీలో మంటలు.. లోపల కెమికల్స్, జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం

కృష్ణాజిల్లా వీరవల్లిలో జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. లారీలో రసాయనాలు వుండటంతో చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు.


కృష్ణాజిల్లా వీరవల్లిలో జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. కెమికల్ లోడ్‌తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ లారీని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అలాగే లారీలో రసాయనాలు వుండటంతో చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!