మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకర పోస్టులు..వైసీపీ కార్యకర్త అరెస్టు

By ramya neerukondaFirst Published Oct 5, 2018, 10:41 AM IST
Highlights

సోషల్‌ మీడియా ద్వారా ఎమ్మెల్యేనుద్దేశించి ‘నీవు చీరలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తావని తెలియక రాజు అన్న నీకు సహాయం చేసినట్టు’ పోస్టు పెట్టాడు. 

టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది.  సోషల్ మీడియాలో ఆమెను కించపరిచేలా, అసభ్యకరమైన పోస్టులను కొందరు పోస్టు చేశారు. అంతేకాకుండా మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. కాగా.. ఆ వ్యక్తిపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..యాదవపురానికి చెందిన గొరిపర్తి నాగబాబు ఆగస్టు 21వ తేదీన సోషల్‌ మీడియా ద్వారా ఎమ్మెల్యేనుద్దేశించి ‘నీవు చీరలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తావని తెలియక రాజు అన్న నీకు సహాయం చేసినట్టు’ పోస్టు పెట్టాడు. 

అంతేకాకుండా  ఆడ ఊసరవెల్లి ఇక్కడ రంగు మార్చింది, పార్టీలు మారిందని... ప్లాష్‌ న్యూస్‌... తప్ప తాగి దొరికిపోయిన ఫోటోతో చిక్కిన మహిళ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే పామర్రు వచ్చేయండి అని, సెప్టెంబరు 23న మళ్లీ ‘మన పామర్రులో మావోయిస్టులు లేరు కదా అవినీతి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండండి మీ మేలు కోరి చెబుతున్నాం అంతే, అరకు ఘనటతో పామర్రు ఫిరాయింపు ఎమ్మెల్యే ముఖ చిత్రం మారిందట, అరకు దాకా వచ్చిన మీరు అమరావతికి రాకపోవడమేంటి అన్నలూ... ఈట్‌ ఈజ్‌ వెరీ దారుణం, ఓపాలొచ్చి పొవచ్చుగదా’ అంటూ పోస్టులు చేశాడు.

అలాగే ఎమ్మెల్యేను భయబ్రాంతుకు గురి చేసేందుకు గొరిపర్తి నాగబాబుయాదవ్‌ మరో వ్యక్తితో కలిసి ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట అనుమానాస్పదంగా సంచరించాడు. దీంతో రిపై అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నాగబాబు మీద 500, 116 ఐపిసి 3(1 ఆర్‌) 3(2)(విఎ) కింద బుధవారం అర్థరాత్రి 12 గంటలకు కేసు నమోదు చేసి నాగబాబును విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకువచ్చామన్నారు. గుడివాడ డిఎస్పీ పి.మహేష్‌ విచారణ చేయనున్నారని ఎస్‌ఐ తెలిపారు.

click me!