మంత్రి సుజయ కృష్ణను నిలదీసిన సొంత పార్టీ ఎమ్మెల్యే

By ramya neerukondaFirst Published Sep 7, 2018, 11:53 AM IST
Highlights

ప్రజా సమస్యలను లేవనెత్తి వాటికి సమాధానం చెప్పాల్సిందిగా ప్రశ్నల వర్షం కురిపించారు. 

మంత్రి సుజయకృష్ణ ను సొంత పార్టీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి నిలదీశారు. ప్రజా సమస్యలను లేవనెత్తి వాటికి సమాధానం చెప్పాల్సిందిగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకీ మ్యాటరేంటంటే... ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కాగా.. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకుంటే తప్ప.. తాము అసెంబ్లీలోకి అడుగుపెట్టమని ప్రతిపక్ష పార్టీ బీష్మించుకు కూర్చుంది. దీంతో.. అధికార పార్టీ నేతలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి సుజయ కృష్ణను ఎమ్మెల్చే నిలదీశారు.

ప్రశ్నోత్తరాల సమయంలో బనగానపల్లె మైనింగ్ బ్లాస్టింగ్‌పై ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు 150 మీటర్ల దూరంలో మైనింగ్ ఉండాలన్న నిబంధన అమలు కావడం లేదన్నారు. పోలీస్, మైనింగ్ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదన్నారు. పేద ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 దీనిపై మంత్రి సుజయకృష్ణ సమాధానం ఇస్తూ మైనింగ్ సేఫ్టీ తమ పరిధిలో లేదని, హైదరాబాద్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైనింగ్ సేఫ్టీ ఆధ్వర్యంలో ఉంటుందని అన్నారు. అయితే మైనింగ్ బ్లాస్టింగ్‌ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుందని మంత్రి సుజయకృష్ణ తెలియజేశారు.

click me!