అందుకు నల్ల చొక్కానే కావాలా..? టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Published : Feb 01, 2019, 11:29 AM IST
అందుకు నల్ల చొక్కానే  కావాలా..? టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

సారాంశం

ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ నేతలంతా అసెంబ్లీకి నల్లచొక్కాలతో హాజరయ్యారు. చంద్రబాబు సహా.. టీడీపీ ఎమ్మెల్యేలంతా నలుపు రంగు చోక్కాలు ధరించి నిరసన తెలపగా.. ఒక్క ఎమ్మెల్యే మాత్రం సాధారణ దుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. ఆయనే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.

ఆయన నలుపు రంగు చొక్కా కాదని.. సాదారణ దుస్తుల్లో రావడంతో అందరూ షాకింగ్ కి గురయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. నిరసన తెలపడానికి నల్ల చొక్కాలే అవసరం లేదన్నారు. నల్లచొక్కాలతో నిరసన తెలిపేందుకు పార్లమెంటులో ఎంపీలు ఉన్నారని తెలిపారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీ తీర్మానమే వజ్రాయుధమని పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేల వాహనాలను తనిఖీ చేయటంపైనా మోదుగుల అభ్యంతరం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు