ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం

Published : Feb 01, 2019, 11:01 AM ISTUpdated : Feb 01, 2019, 11:18 AM IST
ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం

సారాంశం

 ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఏపీ అసెంబ్లీ స్పీకర్  శుక్రవారం నాడు ఆమోదించారు. రాజీనామాలు ఆమోదం పొందిన వారిలో  ఇద్దరు  టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోకరు బీజేపీకి  చెందినవారు.


అమరావతి: ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఏపీ అసెంబ్లీ స్పీకర్  శుక్రవారం నాడు ఆమోదించారు. రాజీనామాలు ఆమోదం పొందిన వారిలో  ఇద్దరు  టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోకరు బీజేపీకి  చెందినవారు.

కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో  మేడా మల్లిఖార్జున్ రెడ్డి విజయం సాధించారు. మేడా మల్లికార్జున్ రెడ్డి  జనవరి 31వ తేదీన  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. గత నెల 22వ తేదీన జగన్‌ను కలిసి ఆయన వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

గత నెల 20వ తేదీన రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. అదే రోజు ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు. మరుసటి రోజునే ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. 

ఆకుల సత్యనారాయణ  కంటే  ముందే  మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు కూడ ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు.  ఈ ముగ్గురు రాజీనామాలను ఇవాళ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమోదించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం