నిరసన: నల్లచొక్కాతో అసెంబ్లీకి చంద్రబాబు (వీడియో)

Published : Feb 01, 2019, 10:46 AM IST
నిరసన: నల్లచొక్కాతో అసెంబ్లీకి చంద్రబాబు (వీడియో)

సారాంశం

 రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసన తెలపడంలో భాగంగా శుక్రవారం నాడు  అసెంబ్లీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నల్లచొక్కాతో హాజరయ్యారు.

అమరావతి:  రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసన తెలపడంలో భాగంగా శుక్రవారం నాడు  అసెంబ్లీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నల్లచొక్కాతో హాజరయ్యారు. టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా నల్లచొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు.

"

గురువారం నాడు జరిగిన టీడీఎల్పీ సమావేశంలోనే ఇవాళ నల్లచొక్కాలతో హాజరుకావాలని పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు కూడ నల్లచొక్కా వేసుకొని  అసెంబ్లీకి వచ్చారు. 

ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి సహాయం చేయడంలో నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తోందని  టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంపై నిరసనలు తెలిపే క్రమంలోనే ఇవాళ నల్లచొక్కాలను ధరించారు.

"

ఏపీ హక్కుల సాదనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు సీఎం  కార్యాచరణను ప్రకటించారు.  విభజన చట్టం అమల్లో కేంద్రం మొండిచేయి చూపిస్తున్నందుకు ఫిబ్రవరి 1న నిరసన దినంగా పాటించాలని బాబు కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలును నీరుగారుస్తున్న ప్రధాని మోడీ తీరును బాబు ఖండించారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu