కమ్మ కులస్థులకు.. ఎమ్మెల్యే జేసీ బహిరంగ క్షమాపణలు

By ramya neerukondaFirst Published Nov 12, 2018, 1:04 PM IST
Highlights

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. కమ్మకులస్థులకు బహిరంగ క్షమాపణలు తెలిపారు.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. కమ్మకులస్థులకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా... ఇప్పటి నుంచే ప్రజలను ఆకట్టుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో ఆదివారం తాడిపత్రిలో ఆండ్ర నాంచారమ్మ ఫంక్షన్ హాల్ లో కమ్మ కులస్థుల ఆత్మీయ సమ్మేళం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాకర్ రెడ్డి హాజరై అందరికీ షాకిచ్చారు. తన కారణంగా కమ్మకులస్థులను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అంటూ బహిరంగంగా పేర్కొన్నారు.

అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని తెలిపారు. తన స్థానంలో తన కమారుడు జేసీ అశ్మిత్ రెడ్డి పోటీకి దిగతాడని తేల్చిచెప్పారు. తాడిపత్రి ప్రజలను తాను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

click me!