
విజయవాడ: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సెటైర్లు వేశారు. సినిమాల్లో అవకాశాలు లేక పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చారని విమర్శించారు. పవన్ మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
వారసత్వరాజకీయాలపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో వారసత్వం లేదా? అని ప్రశ్నించారు. సినిమాల్లో వారసత్వం ఉన్నప్పుడు,రాజకీయాల్లో ఎందుకు ఉండకూడదు? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటు కూడా రాదని జలీల్‌ఖాన్ జోస్యం చెప్పారు.