
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రతో రాజకీయం వేడెక్కింది. జనసేన వర్సెస్ వైసీపీగా మాటల యుద్దం సాగుతుంది. తాజాగా పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అన్నయ్య, తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని సెటైర్ వేశారు. కాకినాడలో కాంగ్రెస్ జెండాలు పాతి పాతి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తాను కాకినాడ లోకల్ అని.. ఏ విషయంలో కూడా తగ్గేది లేదని అన్నారు.
Also Read: నన్ను చంపేందుకు సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఈరోజు పవన్ కల్యాణ్ మాట్లాడిన తర్వాత రేపు ఉదయం అన్ని విషయాలు వివరంగా చెప్తానని అన్నారు. పవన్ కల్యాణ్ తన మీద చేసే ఆరోపణలలో నిజం ఉంటే ఖండించనని తెలిపారు. లేని పోనీ ఆరోపణలు చేస్తే ఖండించడమే కాకుండా ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చారు. తాము బీసీలకు ఏం చేశామో త్వరలో కాకినాడలో సభ ఏర్పాటు చేసి చెబుతామని అన్నారు.