Nara Lokesh : లోకేష్ కు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి : మహానాడులో దూళిపాళ్ల ప్రతిపాదన

Published : May 28, 2025, 03:08 PM ISTUpdated : May 28, 2025, 03:21 PM IST
Chandrababu and Lokesh

సారాంశం

రాయలసీమలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఓ డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అదే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కడప మహానాడు వేదికపైనే, చంద్రబాబు ముందే ఈ డిమాండ్ చేసారు.

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ పగ్గాలు యువ నాయకుడు నారా లోకేష్ కు అప్పగించాలే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే టిడిపి లీడర్లు, క్యాడర్ లోకేష్ కు మరింత ఉన్నతస్థానం కల్పించాలని అధినేత చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు. తాజాగా కడపలో జరుగుతున్న టిడిపి మహానాడులో పలువురు నాయకులు లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలనే ప్రతిపాదనలు చంద్రబాబు ముందుంచుతున్నారు.

కడప మహానాడులో రెండోరోజు గుంటూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రసంగించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడులో నాయకులు వ్యక్తపర్చిన అభిప్రాయాన్ని చంద్రబాబు ముందుంచారు. నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపిన ధూళిపాళ్ల దీన్ని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు పరిశీలించాలని కోరారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా పాలనా వ్యవహరాలు చూసుకుంటే లోకేష్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని... అందుకే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని లీడర్లు, క్యాడర్ కోరుతోంది.

ఇదే అభిప్రాయాన్ని ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యక్తం చేసారు. లోకేష్ ను టిడిపి పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని కోరుకుంటున్నామని... దీన్ని మహానాడు వేదికగా చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని అన్నారు.

టిడిపి నేత ఆనం వెంకట్రామిరెడ్డి కూడా లోకేష్ కు టిడిపి బాధ్యతలు అప్పగించాలని నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఏది కోరుకుంటే అధినేత చంద్రబాబు కూడా అదే చేస్తారు... కాబట్టి లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారన్నారు. కానీ ఇందుకోసం కొంచెం వేచిచూడాలని... తొందరపడవద్దని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.

ఇదిలావుంటే గతంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ టిడిపి నాయకుల నుండి వినిపించింది. పవన్ కల్యాణ్ తో సమానంగా తమ నాయకుడిని చూడాలని టిడిపి శ్రేణులు కోరుకుంటున్నట్లు ఈ డిమాండ్ ను బట్టి అర్ధమవుతోంది. కారణాలేవైనా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కలేదు… కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలయినా అప్పగించాలని టిడిపి నాయకులు కోరుతున్నారు. మరి లోకేష్ విషయంలో పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu