Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్... ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సీరియస్.. కీలక ఆదేశాలు

Published : May 27, 2025, 05:40 PM IST
pawan kalyan

సారాంశం

Pawan Kalyan: సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. టికెట్, తినుబండారాల ధరలపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు.

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హాళ్ల నిర్వహణపై ప్రభుత్వ పర్యవేక్షణ మరింత కఠినంగా మారనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణయాలు సినిమాల టికెట్ ధరలు, థియేటర్లలో ఆహారపదార్థాల ధరల నియంత్రణ, హాళ్ల నిర్వహణ పద్ధతులపై ప్రభావం చూపనున్నాయి. ఈ మేర‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్యాల‌యం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలోని సినిమా హాళ్లను పకడ్బందీగా నిర్వహించి, ప్రేక్షకులకు మెరుగైన అనుభవాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ సంబంధిత శాఖలు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని పవన్ స్పష్టం చేశారు. “నా సినిమా అయినా సరే, టికెట్ ధరల పెంపు ఉంటే అది వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇవ్వాలి” అని ఆయన తేల్చి చెప్పారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమా విషయంలోనూ ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.

ఆహార ధరలపై అధికారుల పర్యవేక్షణ

థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, నీళ్ల బాటిళ్ల ధరలు దారుణంగా పెరిగిపోయాయని పలువురు గుర్తించగా.. “వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు, అసలు ధరలపై అధికారులు క్రమం తప్పకుండా పరిశీలన చేసి, ధరల నియంత్రణ తీసుకురావాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొందరు వ్యాపారవేత్తలు గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తున్నారనే విష‌యాల‌ను ప్రస్తావించారు.

సినిమా హాళ్ల బంద్ ప్రకటనల వెనుక ఉన్న శక్తులపై విచారణ

సినిమా హాళ్ల బంద్ ప్రకటనల వెనుక ఎవరు ఉన్నారు అనే అంశంపై అధికార విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సొంత‌పార్టీ నేత‌లైనా స‌రే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు. ఈ ప్రకటన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమై, దానికి సంబంధించి ఇద్దరు నిర్మాతలు తమ ప్రమేయం లేదని చెప్పడం, ఒక నిర్మాత మీడియా ముందు జనసేన నాయకుడి పేరు చెబుతూ ఆరోపణ చేయడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

ఈ క్ర‌మంలోనే “ సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న వారు ఎవరికైనా, పార్టీకైనా చెందిన వారైనా విచారణ తటస్థంగా కొనసాగాలి. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు. అనారోగ్య వాతావరణానికి తావు ఉండకూడదని” అన్నారు. సినిమా రంగంలో ఒత్తిడి, బెదిరింపులుకు అవకాశం ఇవ్వ‌కూడ‌ద‌ని స్పష్టంగా హెచ్చరించారు.

భవిష్యత్తు ఫిలిం పాలసీపై దిశానిర్దేశం

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న "కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ"లో భాగంగా, తెలుగు సినిమా రంగంలోని అన్ని సంఘాలు తమ సూచనలను అందించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తామని హామీ ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే