గెలిపిస్తే, కేంద్రమంత్రిని చేసే స్థాయి సోమువీర్రాజుకు ఉందా? : భూమన

Published : Apr 06, 2021, 03:39 PM IST
గెలిపిస్తే, కేంద్రమంత్రిని చేసే స్థాయి సోమువీర్రాజుకు ఉందా? : భూమన

సారాంశం

తిరుపతిలో వైఎస్సార్సిపి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎంపీ మిథున్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి డా. గురుమూర్తి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. 

వెంకన్న పాదాల సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. పచ్చి ద్రోహం చేసిన వారికి ఓటు ఎందుకు వేయాలి అని బీజేపీని ఉద్దేశించి..  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు.

రత్నప్రభను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా? అని ప్రశ్నించారు.టీడీపీ గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామనడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు 

పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు బాబు, లోకేష్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!