సీఎం కీలక నిర్ణయం.. ఇక మంగళగిరి మంగళకరమే: ఆళ్ల రామకృష్ణారెడ్డి

Published : Jan 06, 2021, 12:41 PM ISTUpdated : Jan 06, 2021, 01:34 PM IST
సీఎం కీలక నిర్ణయం.. ఇక మంగళగిరి మంగళకరమే: ఆళ్ల రామకృష్ణారెడ్డి

సారాంశం

త్వరలోనే మంగళగిరి కార్పొరేషన్ గా రూపాంతరం చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.  

తాడేపల్లి: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా మార్చాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో మంగళగిరి ప్రాంతం మంగళకరం కానుందని స్థానిక ఎమ్మెల్యే పేర్కొన్నారు.

''మంగళగిరి కార్పొరేషన్ గా రూపాంతరం చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి ఏలాంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించలేదు'' అన్నారు.

 ''రాజధాని 29 గ్రామాల నుంచి మంగళగిరి మండలం వేరు చేస్తున్నారనే ప్రచారం పూర్తి అవాస్తవం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. కేవలం మంగళగిరి నియోజకవర్గ గ్రామాలు మాత్రమే మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడం జరిగింది'' అన్నారు. 

''దాదాపు రూ.1500 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న కాలంలో జగన్ సర్కార్ తాడేపల్లి, మంగళగిరిలో రోడ్డు, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నాం. ఈ పనులతో ఈ ప్రాంత మరింత అభివృద్ధి చెందుతుంది'' అన్నారు ఆళ్ల  రామకృష్ణా రెడ్డి.

PREV
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu