రాంకీ సంస్థలో ఐటీ దాడులు... రుజువయ్యిందిదే..: ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 11, 2021, 10:17 AM IST
Highlights

తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ సంస్థలపై ఇటీవల జరిగిన ఐటీ దాడులపై వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ  దాడులపై టిడిపి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ఆర్కే. 

అమరావతి: తన రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయాన్ని టిడిపి నాయకులు గ్రహించాలని... ఇకనైనా తనమీద అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఆపాలని ఆర్కే సూచించారు. 

''2006లో నేను రాంకీ సంస్థలో ఉద్యోగం చేసాను. అప్పుడు నాకు 2 వేల షేర్లు వచ్చాయి. అనంతరం 2009 లో బోనస్ గా 10 వేల షేర్లు వచ్చాయి. మొత్తం 12వేల షేర్లను అప్పటినుండి ఇప్పటివరకు నా దగ్గరే అట్టి పెట్టుకున్నాను. ఎవరికి విక్రయించలేదు'' అని తెలిపారు.

''ఐటీ దాడుల్లో దొరికిన నగదు నా వద్ద నిభంధనల మేరకే ఉంది. అది రాంకీ గ్రూప్ సంస్థ లో జరిగిన ఐటీ దాడుల్లో రుజువు అయ్యింది.  ఈ మేరకు ఐటీ అధికారులు నాకు లేఖ కూడా ఇచ్చారు'' అని ఆర్కే స్పష్టం చేశారు. 

''స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఒక కంపెనీ, షేర్లు, మూలధనం అంటే ఏమిటో ముందు టీడీపీ నాయకులు తెలుసుకోవాలి.  ఈ విషయాలపై ఒక అవగాహనతో మాట్లాడాలి'' అని సూచించారు. 

వీడియో

''దుగ్గిరాల మండలంలో ఇళ్ల స్థలాలు విషయంలో అవినీతి జరిగింది అన్న మాట అవాస్తవం. టీడీపీ నాయకులు దీన్ని బూచిగా చూపడం కరెక్ట్ కాదు. లోకేష్ పై నేను ఆరువేల ఓట్ల మెజార్టీ తో గెలిచాను... నాకు స్థానిక ప్రజలు అంతటి విజయాన్ని చేకూర్చారు. స్థానిక టీడీపీ నాయకులు ఇది తెలుసుకోవాలి'' అని పేర్కొన్నారు. 

''మేము ఎక్కడా కావాలని పేదల ఇళ్ళు కూల్చలేదు. స్వతహాగా వారి గృహాలలో పనికి వచ్చే వస్తువులు తీసుకెళ్లాక మొండి గోడలను మాత్రమే జేసీబీలతో కూల్చడం జరిగింది. ఇది గ్రహించలేని స్థానిక టీడీపీ నాయకులు నానా గందరగోళం సృష్టించారు'' అని తెలిపారు. 

''కోటి జన్మలెత్తినా టీడీపీకి మంగళగిరి నియోజకవర్గలో విజయం సాధ్య పడదు. పుష్కరాల పేరుతో తాడేపల్లిలో 2000 నివాసాలను టీడీపీ ప్రభుత్వం తొలగించింది. వారికి ఈ రోజు వరకు ఎటువంటి న్యాయం చేయలేదు చంద్రబాబు. అలాంటిది ఆయన ఇప్పుడు ఇళ్ల కూల్చివేత అంటూ గగ్గోలు పెడుతున్నారు'' అని ఆళ్ళ మండిపడ్డారు.

click me!