ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోనే చంద్రబాబు నివాసం ఉంది. ప్రకాశం బ్యారేజీ బ్యాక్ వాటర్స్ సమీపంలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా సుమారు నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అదే నివాసం ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పరిశీలించారు. వరదల కారణంగా కృష్ణా నది కరట్ట అంచున ఉన్న చంద్రబాబు నివాసం ఇప్పుడు ప్రమాదంలో పడింది. పులిచింతల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. ఈ వరద నీరు కారణంగా.. కృష్ణా జిల్లా కరకట్ట వద్దకు నీరు భారీగా చేరుకుంది. దీంతో... చంద్రబాబు నివాసానికి వరద ముంపు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు.
కృష్ణా నదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేయడంతో వరద నీరు పోటెత్తుతోంది. ఆ నీరంతా దిగువకు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం మరింత పెరిగితే చంద్రబాబు నివాసానికి మప్పు తప్పదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి పులిచింతల దాకా కృష్ణానదిపై నిర్మించిన భారీ నీటి పారుదల ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్న నేపథ్యంలో నీటికి దిగువకు వదులుతున్నారు.
ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోనే చంద్రబాబు నివాసం ఉంది. ప్రకాశం బ్యారేజీ బ్యాక్ వాటర్స్ సమీపంలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా సుమారు నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అదే నివాసం ఉన్నారు. భారతీయ జనతాపార్టీ నేత, లోక్ సభ మాజీ సభ్యుడు గోకరాజు రంగరాజుకు సంబంధించిన అతిథిగృహం అది. కృష్ణా నది బఫర్ జోన్ పరిధిలో దాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.
కాగా... ఇప్పుడు ఈ వరద కారణంగా మాజీ సీఎం నివాసానికి ముప్పు ఉందన్న వార్తలు వస్తున్న క్రమంలో ఆ ప్రాంతాన్ని బుధవారం ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పరిశీలించారు. ఈ విషయం గురించి అధికారులను ఆర్కే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం చంద్రబాబు కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లారు.