జగన్ వస్తే వేధింపులు ఆగుతాయనుకున్నా.. కానీ: నా వల్ల కాదు చచ్చిపోతున్నా

Siva Kodati |  
Published : Aug 14, 2019, 09:33 AM IST
జగన్ వస్తే వేధింపులు ఆగుతాయనుకున్నా.. కానీ: నా వల్ల కాదు చచ్చిపోతున్నా

సారాంశం

ఇటికేపల్లికి చెందిన నాగేంద్రబాబు ఎన్ఆర్ఎస్ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన యజమాని దగ్గర రూ.65 వేలు అప్పుగా తీసుకున్నాడు. కొద్దిరోజుల నుంచి బాకీ తీర్చాలని యజమాని వద్ద నుంచి వేధింపులు ఎక్కువకావడంతో వాటిని భరించలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తీసుకున్న అప్పు చెల్లించాలని ఓ లారీ డ్రైవర్‌కు వేధింపులు రావడంతో నాగేంద్రబాబు అనే వ్యక్తి ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ఇటికేపల్లికి చెందిన నాగేంద్రబాబు ఎన్ఆర్ఎస్ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో తన యజమాని దగ్గర రూ.65 వేలు అప్పుగా తీసుకున్నాడు. కొద్దిరోజుల నుంచి బాకీ తీర్చాలని యజమాని వద్ద నుంచి వేధింపులు ఎక్కువకావడంతో వాటిని భరించలేకపోయాడు.

ఈ నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జగన్ వస్తే వేధింపులు తగ్గుతాయని అనుకున్నానని.. డ్రైవర్‌ల జీవితాలపై కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని సదరు పోస్ట్‌లో నాగేంద్రబాబు విజ్ఞప్తి చేశాడు. 

PREV
click me!

Recommended Stories

ఊహించని న్యూస్ చెప్పిన Pemmasani Chandrashekar | Chandrababu | Asianet Telugu
Chandrababu Great Speech About Janasena | Pawan Kalyan | Asianet Telugu