'వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి మిస్సింగ్'..  వెతికిపెట్టమంటున్న మహిళలు!

By tirumala ANFirst Published Dec 24, 2019, 12:25 PM IST
Highlights

నిన్న...ఆర్కే..ఈ రోజు ఉండవల్లి శ్రీదేవి...వైసీపీ ఎమ్యెల్యేలు కనపడటం లేదని రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. తమ ఎమ్మెల్యే శ్రీదేవి కనిపించడం లేదని మహిళలు నేడు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

నిన్న...ఆర్కే..ఈ రోజు ఉండవల్లి శ్రీదేవి...వైసీపీ ఎమ్యెల్యేలు కనపడటం లేదని రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. తమ ఎమ్మెల్యే శ్రీదేవి కనిపించడం లేదని మహిళలు నేడు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  వారం రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి ప్రజలు, రైతులు రోడ్లెక్కారు. తమ ప్రాంతం నుంచి రాజధానిని తరలించడానికి వెళ్ళేడు అంటూ, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. కానీ ఒక్క వైసిపి ఎమ్మెల్యే కూడా తమ గోడుని వినిపించుకోవడం లేదని.. కొందరు ప్రజలకు దూరంగా అజ్ఞాతంలో ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సోమవారం రోజు మంగళగిరి రైతులు ఎమ్మెల్యే ఆర్కే పై పోలీసులుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమ ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని.. ఆయన్ని వెతికి పెట్టాలని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అదే తరహాలో నేడు శ్రీదేవిపై మహిళలు ఫిర్యాదు చేశారు. 

AP Capital: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదంటా!

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అమరావతిని కేవలం శాసన నిర్వహణ రాజధానిగా మాత్రమే ఉంచుతామని జగన్ ప్రకటన చేశారు. వైజాగ్ ని కార్యనిర్వహణ రాజధానిగా, కర్నూలుని జ్యుడిషియల్ రాజధానిగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 

click me!