
మచిలీపట్నం : ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లు పెళ్లికాకుండానే గర్భం దాల్చిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు... అదీ మైనర్ అక్కాచెల్లెల్లు గర్భవతులవడం కలకలం రేపుతోంది. ఇద్దరిపై ఏదయినా అఘాయిత్యం జరిగిందా లేక ఇద్దరికీ మాయమాటలతో ఎవరైనా లోబర్చుకుని గర్భవతులను చేసారా అన్నది తెలియాల్సి వుంది.
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గపరిధిలోని పమిడిముక్కల మండలం మంటాడ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు ఇంటర్మీడియట్ సెకండీయర్ మరొకరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీరిద్దరూ ఇటీవల కాస్త అనారోగ్యంగా వుంటుండటంతో కుటుంబసభ్యులు వైద్యపరీక్షలు చేయించగా షాకింగ్ విషయం బయటపడింది. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు గర్భం దాల్చినట్లు రిపోర్టుల్లో తేలింది. అయితే తమ గర్భం రావడానికి కారకులెవరో... అసలు ఏం జరిగిందో చెప్పకుండా మైనర్లు మౌనం దాల్చడంతో తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు.
Read more ఛాతీపై తుపాకీ పెట్టి బెదిరించి అసహజ శృంగారం... ఎంపీలో దారుణం
ఇద్దరు బాలికల్లో ఒకరు 9 నెలల నిండు గర్భంలో వుండగా మరో యువతి 6నెలల గర్భంతో వున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అసలేం జరింగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువతులిద్దరూ మైనర్లు కావడంతో వారి వివరాలను గోప్యంగా వుంచారు.
అక్కాచెల్లెలు ఇద్దరినీ ప్రేమ పేరుతో లేక ఇంకేదయినా ఆశచూపి లోబర్చుకుని వుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి గర్భానికి ఒక్కరే కారణమా, వీరిపై ఏదయానా అఘాయిత్యం జరిగిందా, అమ్మాయిలిద్దరూ ఇలా ఒకేసారి గర్భవతులుగా మారడం ఏంటి... ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.