రేపల్లెలో ట్యూషన్‌కి వెళ్లిన విద్యార్ధినికి టీచర్ లైంగిక వేధింపులు: ఫోక్సో చట్టం కింద కేసు

Published : May 01, 2022, 10:26 AM IST
 రేపల్లెలో ట్యూషన్‌కి వెళ్లిన విద్యార్ధినికి  టీచర్ లైంగిక వేధింపులు: ఫోక్సో చట్టం కింద కేసు

సారాంశం

ట్యూషన్ కు వెళ్లిన విద్యార్ధినిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగింది.  


రేపల్లె:ట్యూషన్ కు వెళ్లిన వద్యార్ధినిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని Repalleలో జరిగింది.

రేపల్లెలోని 19వ వార్డుకు చెందిన ఇసుకపల్లిలో మోపిదేవి శివకుమార్ అలియాస్ బాబీ Tution సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ ట్యూషన్ సెంటర్ లో బాలిక చేరింది. ఆర్నెళ్లుగా నుండి Mopidevi Siva kumar తనపై Sexual Harassment పాల్పడుతున్నట్టుగా బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వేధింపులు భరించలేక తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ట్యూషన్ కు వచ్చిన విద్యార్ధులను బయట కూర్చోబెట్టి తనను మాత్రం గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై ఇంట్లో చెబితే మార్ఫింగ్ ఫోటోలతో తనను బెదిరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ వేధింపులు తీవ్రం కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిపై Pocso Act  కింద కేసు నమోదు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu