రిజర్వాయర్ లో దూకి మైనర్ ప్రేమజంట ఆత్మహత్య..

Published : Aug 06, 2022, 01:07 PM IST
రిజర్వాయర్ లో దూకి మైనర్ ప్రేమజంట ఆత్మహత్య..

సారాంశం

ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం అనంతపురంలో కలకలం రేపింది. రిజర్వాయర్ లోకి దూకి చనిపోవడంతో శనివారం ఉదయం మృతదేహాలను వెలికి తీశారు. 

అనంతపురం : అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ లోకి దూకి ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన  ఎజిత (16), బెలుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన అజయ్ (19) మృతదేహాలను శుక్రవారం సాయంత్రం జీడిపల్లి రిజర్వాయర్ లో స్థానికుల్లో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే చీకటి పడడంతో శుక్రవారం మృతదేహాలను వెలికి తీయడం సాధ్యం కాలేదు. శనివారం ఉదయం మృతదేహాలను వెలికి తీశారు. మృతుల కుటుంబ సభ్యులనుంచి ఫిర్యాదు స్వీకరించి సమగ్ర దర్యాప్తు చేపట్టిన తరువాత.. వివరాలు వెల్లడిస్తామని బెళుగుప్ప ఎస్సై రుషేంద్రబాబు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లో జూన్ 28న ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బస్తీలో మైనర్ ప్రేమజంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలోని గౌసియాహ్వా పోఖ్రే సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్న పదహారేళ్ల బాలిక, 17 ఏళ్ల బాలుడి మృతదేహాలు కనిపించాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ జంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం చెలరేగింది. అంతకుముందు రోజు తన సోదరుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని మృతుని సోదరుడు తెలిపాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో ఫోన్ చేయడంతో అతను కట్ చేశాడన్నారు. 

విశాఖపట్నంలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. వైద్య విద్యార్థికి లక్షణాలు..!

అయితే సోదరుడు తన తో చాటింగ్ చేస్తూ చాలా దూరం వెళ్తున్నానని, ఇక తిరిగి రానని మెసేజ్ చేశాడు అని అన్నారు. కాగా, ఈ ఇద్దరు మైనర్లు ఒకే తరగతిలో చదువుకుంటున్నారు. వారిద్దరూ ఏడాదిగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం వీరిద్దరూ కలిసి ఒకే చోట కనిపించడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ బాలికను అమ్మమ్మ గ్రామమైన కర్మియాకు పంపించారు. ఆదివారం వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తరువాత వీరి మృతదేహాలు కనిపించాయి. 

మృతులు మైనర్ లేనని పోలీస్ అధికారి అంబికారామ్ తెలిపారు. అమ్మాయికి పదహారేళ్లు,  అబ్బాయికి పదిహేడేళ్ల అని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం తరలించారు. దీనికి సంబంధించిన రిపోర్టు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి తల్లి ఇంతకుముందే మృతి చెందిందని.. తండ్రి ముంబైలో పని చేస్తున్నాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త