ఎన్టీఆర్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు.. (వీడియో)

Published : Aug 06, 2022, 11:42 AM IST
ఎన్టీఆర్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు.. (వీడియో)

సారాంశం

ఎన్టీఆర్ జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. చీకట్లో చూసుకోకుండా ఓ ఆర్టీసీ బస్సు వరద నీటితో పొంగిపొర్లుతున్న వాగులో చిక్కుకుంది. ఈ సమయంలో బస్సులో 50మంది ప్రయాణీకులు ఉన్నారు.   

ఎన్టీఆర్ జిల్లా : NTR జిల్లా, జగ్గయ్యపేటలో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. అయితే బస్సు సురక్షితంగా ఒడ్డుకు చేరింది. దీంట్లోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెడితే...పెనుగంచిప్రోలు మండలం ముళ్ళపాడు గండి వాగులో ఆర్టీసీ బస్సు ఇరుక్కుంది. విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు మీదగా ఖమ్మం వెడుతున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. 

భారీ వర్షాలకు తోడు.. వరద ప్రవాహం చేరడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ముళ్ళపాడు గండి వాగు కూడా పొంగిపొర్లుతుంది. అయితే, నీళ్ల ప్రవాహాన్ని గమనించని డ్రైవర్.. చీకట్లో చూసుకోకుండా బస్సును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో బస్సు వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది. విషయం తెలిసిన ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గత రేండు రోజులుగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు మండలం ముళ్ళపాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసి బస్సు వరదనీటిలో చిక్కుకుంది. 

రేండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెనుగంచిప్రోలు మండలం ముళ్ళపాడు  వాగు దగ్గర వరదనీరు భారీగా చేరింది. ఇందులో చిక్కుకున్న బస్సు సగం వరకు నీటిలో మునిగిపోయింది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బెంబేలెత్తిపోయారు. పెద్దగా కేకల వేశారు. వెంటనే స్థానికులు గమనించి అక్కడికి చేరుకున్నారు. శాయ శక్తులా కృషి చేసి, బస్సును ప్రయాణికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu
Chandrababu Naidu Speech: చరిత్ర తిరగరాసే నాయకత్వం వాజ్ పేయీది: చంద్రబాబు| Asianet News Telugu