బాలికపై మైనర్ బాలుడి అత్యాచారం... గర్భం దాల్చడంతో...

Published : Oct 24, 2022, 08:05 AM IST
బాలికపై మైనర్ బాలుడి అత్యాచారం... గర్భం దాల్చడంతో...

సారాంశం

ఓ మైనర్ బాలిక మీద బాలుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను తీసుకుని బాలుడు పరారయ్యాడు. 

క్రిష్ణా జిల్లా : బాలికపై అత్యాచారం చేయగా.. గర్భం దాల్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉయ్యూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటుంది. తోట్లవల్లూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్న తన నానమ్మ ఇంటికి తరచూ వచ్చి రెండు, మూడు రోజులు ఉండి వెళుతూ ఉండేది. ఈ క్రమంలో తోట్లవల్లూరు మండలంలోని అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి (18)కి ఆ బాలికతో పరిచయం పెరగడంతో ఇద్దరు కలిసి మెలిసి తిరిగేవారు. 

బాలిక నానమ్మకు దృష్టి, వినికిడి లోపం ఉండడంతో రాత్రి సమయంలో ఇంట్లో ఇద్దరు సఖ్యతగా మెలిగేవారు.  ఇటీవల బాలిక శరీరంలో వచ్చిన మార్పులు గమనించిన తల్లిదండ్రులు పరీక్షలు చేయించారు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను తీసుకుని మచిలీపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు అర్ధరాత్రి ఇంటర్ విద్యార్థి బాలికను తీసుకుని పరారయ్యాడు. తల్లిదండ్రులు ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో  కిడ్నాప్ చేశారంటూ ఉయ్యూరు స్టేషన్లో మళ్లీ ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి ఆ బాలికను తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు.

విజయవాడలో విషాదం: బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం, ఇద్దరు సజీవ దహనం

వెంటనే తల్లిదండ్రులు బాలికను స్టేషన్కు తీసుకు వెళ్లి ఆ విద్యార్థి పై ఫిర్యాదు చేయడంతో..  పోలీసులు కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు సమాచారం చెప్పడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో తొట్లవల్లూరు  మండలంలోని ఓ గ్రామాన్ని డిఎస్పి జి రాజీవ్ కుమార్, సిఐ టీవీ  నరేష్, ఉయ్యూరు గ్రామీణ ఎస్సై రమేష్, తోట్లవల్లూరు ఇంచార్జ్  ఎస్సై సిహెచ్ అవినాష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి,  స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే